వాట్సాప్ స్పందన
ఇప్పటికే పారగాన్ కు లేఖ పంపామని, ప్రస్తుతం చట్టపరమైన చర్యలను పరిశీలిస్తున్నామని వాట్సాప్ పేర్కొంది. డిసెంబరులో అన్ని దాడులను నిలిపివేసినట్లు కంపెనీ పేర్కొన్నప్పటికీ, అవి ఎంతకాలం నుంచి కొనసాగుతున్నాయో అస్పష్టంగా ఉంది. జర్నలిస్టులు, పౌర సమాజ సభ్యులతో సహా అనేక మంది యూజర్లను లక్ష్యంగా చేసుకుని పారాగాన్ చేసిన స్పైవేర్ ప్రమాదాన్ని వాట్సాప్ విజయవంతంగా భగ్నం చేసింది. ‘‘ఎవరి డివైజ్ ల్లోని వాట్సాప్ ల్లో ఈ స్పైవేర్ చేరిందని మాకు సమాచారం ఉందో, ఆ వ్యక్తులను మేము నేరుగా సంప్రదించాము. తగిన చర్యలను సూచించాము’’ అని వాట్సాప్ వివరించింది. ‘‘స్పైవేర్ కంపెనీలు తమ చట్టవ్యతిరేక చర్యలకు ఎందుకు బాధ్యత వహించాలో చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ. వ్యక్తిగతంగా కమ్యూనికేట్ చేసే ప్రజల హక్కులను వాట్సాప్ పరిరక్షిస్తూనే ఉంటుంది’ అని వాట్సాప్ ప్రతినిధి ఒకరు ‘ది గార్డియన్’కు తెలిపారు.