తొమ్మిదితో హనుమంతుడికి ఉన్న బలమైన సంబంధం
- 9, 18, 27వ తేదీల్లో పుట్టిన వారికి హనుమంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. హనుమంతుడు కుజుడుకి సంబంధించిన వారు. హనుమంతుడుతో పాటు మంగళవారం కుజుడిని కూడా పూజిస్తాము.
- ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే అంగారకుడు అశుభం లేదా చెడుగా ఉండడం వలన అవ్వచ్చు.
- ఒకవేళ కుజుడు చెడుగా ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంట్లో కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు.
- అదే కుజుడు శుభ స్థానంలో ఉన్నట్లయితే కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు.
- ఎవరైతే ఏ స్వార్ధం లేకుండా వారి పనులు చేసుకుంటారో వారికి హనుమంతుడు ఆశీస్సులు కలుగుతాయి. నిర్మల హృదయం కలవారు, ఎలాంటి భేదం లేకుండా ప్రజలకు సహాయం చేసే వారు, సేవ చేసే వారికీ ఎప్పుడూ హనుమంతుడికి అనుగ్రహం ఉంటుంది.
- ఇలా ఈ విధంగా 9 సంఖ్య వారికి హనుమంతుడి అనుగ్రహం, కుజుడి అనుగ్రహం ఉంటాయి. ఎలాంటి భయం లేకుండా ఈ సంఖ్యకు సంబంధించిన వారు సంతోషంగా ఉంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.