అక్కినేని ఫ్యామిలీ ఒక భారీ విజయాన్ని అందుకొని చాలా కాలమైంది. దీంతో ‘తండేల్’ సినిమాపైనే అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాని, తాజాగా నాగార్జున ప్రత్యేకంగా వీక్షించినట్లు తెలుస్తోంది. (Thandel)
నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘తండేల్’. గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమా, పాకిస్థాన్ జైలులో చిక్కుకున్న శ్రీకాకుళం జాలర్ల నిజ జీవితం ఆధారంగా రూపొందింది. ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న ‘తండేల్’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గా వచ్చింది. అలాగే ఇటీవల నిర్మాత అల్లు అర్జున్ ఈ సినిమా చూసి డిస్టింక్షన్ లో పాస్ అని స్టాంప్ వేసేశారు. ఇక ఇప్పుడు నాగార్జున సైతం తండేల్ పట్ల సంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. తాజాగా తండేల్ టీం నాగార్జునకు స్పెషల్ షో వేసి చూపించారట. సినిమా చూసిన నాగార్జున, చాలా బాగా తీశారని టీంని మెచ్చుకున్నారట. చైతన్య కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని నమ్మకం వ్యక్తం చేశారట. (Nagarjuna)
తండేల్ మూవీ చైతన్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగింది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే, చైతన్య కెరీర్ లో రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా తండేల్ నిలుస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి.