మహిళా ఓటర్లు ఆప్ వైపు.
ఆప్ ప్రకటించిన పలు పథకాలు, వరాలతో మహిళా ఓటర్లు ఆప్ వైపు మొగ్గు చూపుతున్నారు. మహిళా ఓటర్లలో ఆప్ కు 50.20 శాతం, బీజేపీకి 41.90, కాంగ్రెస్ కు 6.10, ఇతరులకు 1.90 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పురుష ఓటర్ల నాడిని అంచనా వేస్తే బీజేపికి 53 శాతం, ఆప్ కు 35 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. అగ్రవర్ణాల వారు, ఓబీసీలు బీజేపీకి మద్దతిస్తున్నారు. దళితులు, ముస్లింలు, సిక్కులు, జాతవ్, చమార్, వాల్మీకి సామాజిక వర్గాల ఓటర్లు ఆప్ వైపు మొగ్గు చూపుతున్నారు. సామాజిక వర్గాలను పరిశీలిస్తే బ్రాహ్మణులు, రాజ్ పుత్, జాట్లు, బనియాలు, అగర్వాల్, కశ్మీర్ పండిట్లు, గుప్తా సామాజిక ఓటర్లు బీజేపీ వైపు ఉన్నారు. ఆప్ కు 70.5 శాతం ముస్లింల, 54.2 శాతం సిక్కుల మద్దతు కనిపిస్తుంది.