తేజసజ్జ,(Teja Sajja)ప్రశాంత్ వర్మ(Prashanth Varma)కాంబోలో 2021 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ జాంబీరెడ్డి(Zombie Reddy)యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెకెక్కిన ఈ మూవీ మంచి విజయాన్ని నమోదు చేసింది.పైగా సోలో హీరోగా తేజసజ్జ కి మొదటి విజయం కూడా జాంబీరెడ్డి ద్వారానే వచ్చింది.

గత కొన్ని రోజులుగా జాంబిరెడ్డి కి  సీక్వెల్ ని తెరకెక్కించబోతున్నారని,కాకపోతే ప్రశాంత్ వర్మ(Prashanth Varma)కథ మాత్రమే అందిస్తాడని,దర్శకుడుగా వేరే వాళ్ళు ఉంటారనే వార్తలు  కొన్ని రోజుల నుంచి ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.ఇప్పుడు ఆ వార్తలకి బలం చేకూర్చేలా,జాంబీరెడ్డి విడుదలై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా తేజ సజ్జ సోషల్ మీడియా వేదికగా జాంబిరెడ్డి 2 ఉందనేలా టూ ఫింగర్స్ చూపిస్తూ ఎమోజీని పోస్ట్ చేసాడు.దీంతో జాంబీ రెడ్డి సీక్వెల్ తెరకెక్కడం ఖాయమనే సంకేతాలు ఇచ్చినట్టయింది.

 ఇక సజ్జ చేసిన ఎమోజికి సితార ఎంటర్ టైన్ మెంట్ అధినేత నాగవంశీ(Naga vamshi)’సూన్’ అంటూ  రిప్లయ్ ఇవ్వడంతో సితార బ్యానర్ లో జాంబిరెడ్డి 2  తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది.తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థల్లో సితార కూడా ఒకటి. రీసెంట్ గా బాలకృష్ణ తో ‘డాకు మహారాజ్’ ని తెరకెక్కించి హిట్ ని అందుకున్న ఈ సంస్థ భీమ్లా నాయక్,జెర్సీ, భీష్మ,టిల్లు స్క్వేర్ వంటి పలు విజయవంతమైన చిత్రాలని నిర్మించింది.

 

 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here