ఆస్తి వివాదం ప్రముఖ పారిశ్రామికవేత్త హత్యకు దారి తీసింది. ఆస్తి పంచి ఇవ్వడం లేదని తాతను సొంత మనవడే కత్తితో పొడిచి హత్య చేశాడు. అడ్డుకోబోయిన తల్లిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి బేగంపేట ఏరియాలో జరిగింది. ఈ హత్య గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలమాటి చంద్రశేఖర జనార్దన రావుకు పటాన్చెరు, బాలానగర్ పారిశ్రామికవాడల్లో పరిశ్రమలు ఉన్నాయి. ఆయన కుమార్తె సరోజినీదేవి. భర్తతో విభేదాలు రావడంతో తండ్రి వద్దే ఉంటుంది. ఆమె కుమారుడు కిలారు కీర్తితేజ తల్లిదండ్రులతో కాకుండా వేరుగా ఉంటున్నాడు.