ఆధార్ అనుసంధానం తప్పనిసరి
రేషన్ కార్డులో నమోదై ఉన్న కుటుంబ సభ్యులందరూ రేషన్ ప్రయోజనాలను పొందడంలో అంతరాయం కలగకుండా ఉండటానికి వారి ఆధార్ ను వారి రేషన్ కార్డుతో అనుసంధానం చేయాలి. ఆధార్ అథెంటికేషన్, మొబైల్ నంబర్, ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ తో కూడిన తప్పనిసరి కేవైసీ (Know Your Customer) వెరిఫికేషన్‌ను కూడా ప్రభుత్వం అమలు చేసింది. రేషన్ కార్డుతో ఆధార్ ను అనుసంధానించడంతో పాటు, ఆధార్ కార్డుపై పేరు, చిరునామా లేదా పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేయడానికి యుఐడిఎఐ అవకాశం కల్పించింది. మొదట డిసెంబర్ 14, 2024తో ముగియాల్సిన ఈ సదుపాయాన్ని ఇప్పుడు జూన్ 14, 2025 వరకు పొడిగించారు.