ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అయిన ‘తండేల్‌’ చిత్రానికి పబ్లిక్‌ నుంచి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. దానికి తోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. అంతేకాదు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సినిమాను ఒక రేంజ్‌లో అప్రిషియేట్‌ చేశారు. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్‌లో ప్రారంభమైంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల 20 లక్షలు కలెక్ట్‌ చేసింది. రెండో రోజు మొదటి రోజుకు ధీటుగా 20 కోట్లు కలెక్ట్‌ చేసి తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళుతోంది. ఈ సినిమాలో నాగచైతన్య, సాయిపల్లవిల పెర్‌ఫార్మెన్స్‌తోపాటు చందు మొండేటి సబ్జెక్ట్‌ని డీల్‌ చేసిన విధానం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటోంది. ఒక సీరియస్‌ సమస్యను చూపిస్తూనే అందులో ఒక ప్రేమకథను కూడా అందంగా చెప్పే ప్రయత్నం చేశారు. 

గత కొంతకాలంగా హిట్‌లేక సతమతమవుతున్న నాగచైతన్యకు తండేల్‌ మంచి ఊరటనిచ్చిందనే చెప్పాలి. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం మొదటి రోజు రూ. 21.20 కోట్లు వసూలు చేసినట్టు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఇక రెండో రోజు రూ. 20 కోట్లు వచ్చినట్టు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం రెండు రోజులు కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా రూ.41.20 కోట్ల వసూళ్లు సాధించినట్లుగా మేకర్స్‌ అధికారికంగా పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. కలెక్షన్ల పరంగా నాగచైతన్య కెరీర్‌లో ఇదే హయ్యస్ట్‌ ఓపెనింగ్‌ కలెక్షన్‌. దీంతో అక్కినేని ఫ్యాన్స్‌ చాలా హ్యాపీగా ఉన్నారు. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here