యువసామ్రాట్ నాగచైతన్య(Naga chaitanya)సాయిపల్లవి(Sai Pallavi)కాంబోలో అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్(Geetha Arts)నిర్మించిన చిత్రం తండేల్(Thandel)ఈ నెల7 న విడుదలైన ఈ మూవీ ఇప్పుడు మంచి ప్రేక్షకాదరణతో ముందుకు దూసుకుపోతుంది.చైతు కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టిన తండేల్ రెండు రోజులకి 40 కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించి 50 కోట్ల వైపు దూసుకెళ్తుంది.
ఇక ఈ మూవీ రీసెంట్ గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణకి చెందిన ఒక బస్సు లో ప్రదర్శితమవ్వగా ప్రేక్షకులందరు చూడటం జరిగింది.ఇప్పుడు ఈ విషయంపై తండేల్ నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాసు(Bunny Vasu)సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు ఏపి కి చెందిన సర్వీస్ నెంబర్ 3066 లో మా తండేల్ సినిమా పైరేటెడ్ వెర్షన్ ప్లే చేసినట్టుగా తెలుసుకున్నాం.ఆ విధంగా చెయ్యడం చట్ట విరుద్ధమే కాదు దౌర్జన్యం.’తండేల్’ కోసం విశ్రాంతి అనేది లేకుండా పని చేసిన ఎంతో మంది టెక్నీషియన్స్ ని కూడా అవమానించడమే.సినిమా అనేది నటి నటులతో పాటు దర్శకుడి కల.పైరసీ విషయాన్నీ ఏపీఎస్ఆర్టిసి చైర్మన్ కొనకళ్ల నారాయణ గారు సీరియస్ గా తీసుకొని స్పందించాలి.అదే విధంగా భవిష్యత్తు లో ఇలాంటివి జరగకుండా కఠినమైన చర్యలు కూడా తీసుకు రావాలని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసాడు.
‘తండేల్’ విడుదలైన రెండో రోజునే ఆన్లైన్ లో లీక్ అవ్వడంతో పాటుగా,ఓ లోకల్ ఛానల్లోను ప్రసారమైంది.ఇటీవలే ‘గేమ్ ఛేంజర్'(Game Changer)ని సైతం లోకల్ ఛానల్లోను రెండో రోజే ప్రదర్శించడం తెలిసిందే.