టాప్ 30 సూచీల్లో టాటా స్టీల్, పవర్ గ్రిడ్ షేర్లు 3 శాతానికి పైగా నష్టపోయాయి. 30 షేర్లలో 24 షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్ లోని 232 కంపెనీల షేర్లు ఈ రోజు అప్పర్ సర్క్యూట్ ను తాకాయి. 349 కంపెనీలు లోయర్ సర్క్యూట్ ను తాకాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. ఇన్వెస్టర్లు సంపదగా భావించే బీఎస్ఈలో నమోదైన కంపెనీల మెుత్తం విలువలో సుమారు 6 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయాయి.