టాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ తండేల్ ఈవెంట్ లో రామ్ చరణ్ స్థాయి తగ్గించేలా మాట్లాడానని తనను ట్రోల్ చేస్తున్నారని తెలిపారు. రామ్ చరణ్ ను ఉద్దేశపూర్వకంగా తాను ఏమీ అనలేదని స్పష్టం చేశారు. దిల్ రాజు పరిస్థితిని వివరించే క్రమంలో తాను మాట్లాడిన మాటలు మరోలా అర్థం చేసుకున్నారని అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు.