వేతనాలకు రూ.85 వేల కోట్లు
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు చెల్లిస్తున్నామని, ఇప్పటి వరకు ఈ పద్దు కింద రూ.85,445 కోట్లు చెల్లించామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ, ఎన్టీఆర్ భరోసా, దీపం 2.0 పథకాలకు ఇప్పటి వరకు రూ.31,613 కోట్లు ఖర్చు చేశామన్నారు. స్థానిక సంస్థల బలోపేతం కొరకు పంచాయతీలకు రూ.2,488 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. మొత్తం 95 సెంట్రల్ స్పాన్సర్డ్ పథకాల్లో 74 పథకాలను పునరుద్దరించినట్టు వెల్లడించారు.