ఆర్.జి.వి. ఆర్వీ ప్రొడక్షన్స్ పతాకంపై గిరికృష్ణ కమల్ దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘శారీ’. టూ మచ్ లవ్ కెన్‌బి స్కేరీ అనే ట్యాగ్‌లైన్‌తో కూడిన ఈ సినిమాను రవిశంకర్ వర్మ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ఫిబ్రవరి 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సత్యయాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం మ్యాంగో మీడియా ద్వారా విడుదల చేశారు.
ప్రస్తుత జనరేషన్లో మీడియా, సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉందో, అంతే అనర్థం కూడా ఉందని చెప్పే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌లో వినిపించే రామ్‌గోపాల్‌వర్మ సినిమాలోని ప్రధాన ఇతివృత్తాన్ని చెప్పారు. ‘సోషల్ మీడియాలో ముక్కు మొహం తెలియని వాళ్ళతో పరిచయాలు పెంచుకుని, వాళ్ళ బ్యాక్గ్రౌండ్గాని, ఫోర్గ్రౌండ్గాని ఏమి తెలియకుండా నమ్మేయడంతో… ఎదురయ్యే ప్రమాదాలు, భయంకర సంఘటనలు, మనం చాలా చాలా విన్నాం, చూసాం. అలాంటి నిజ జీవిత ఘటన ఆధారంగా తీసిన సినిమా ఈ ‘శారీ’ అంటూ సినిమా గురించి ఒక క్లారిటీ ఇచ్చారు వర్మ.
నిర్మాత రవిశంకర్‌వర్మ మాట్లాడుతూ ‘మా ‘శారీ’ చిత్రంలోని టీజర్, ‘ఐ వాంట్ లవ్’, ‘ఎగిరే గువ్వలాగా…’ ఈ రెండు లిరికల్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. ఫిబ్రవరి 28న దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’ అన్నారు. సత్య యాదు, ఆరాధ్యదేవి, సాహిట్, సంభవాల్, అప్పాజీ అంబరీష్, కల్పలత తదితరులు నటించిన ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ: శబరి, రచన, సమర్పణ: రామ్‌గోపాల్‌వర్మ, నిర్మాత: రవిశంకర్ వర్మ, దర్శకత్వం: గిరికృష్ణ కమల్.