వి మూవీస్ & టివి యాప్ ఎలా పనిచేస్తుంది
వి మూవీస్ & టివి యాప్ ఆల్ ఇన్ వన్ ప్లాట్ ఫామ్ గా పనిచేస్తుంది. అనేక ప్రసిద్ధ ఓటిటి సేవలను సులభంగా ఉపయోగించడానికి వీలు కల్పించే యాప్ గా ఉంటుంది. ఈ ప్లాన్ తో డిస్నీ+ హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, లయన్స్ గేట్ ప్లే వంటి పాపులర్ ప్లాట్ ఫామ్ లను సబ్ స్క్రైబర్లు ఆస్వాదించవచ్చు. మలయాళం, కన్నడ, బెంగాలీ, దక్షిణ భారతీయ భాషలతో సహా వివిధ భాషల్లో కంటెంట్ అందుబాటులో ఉంది. మనోరమ మ్యాక్స్, నమ్మాఫ్లిక్స్, సన్ నెక్స్ట్, క్లిక్ వంటి ప్రాంతీయ స్ట్రీమింగ్ ఓటీటీలు కూడా అందుబాటులో ఉన్నాయి.అదనంగా, డిస్నీ + హాట్ స్టార్, సోనీ లివ్ ద్వారా అందుబాటులో ఉన్న లైవ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ను కూడా యూజర్లు ఆస్వాదించవచ్చు. కె-డ్రామాస్ అభిమానుల కోసం, ప్లే ఫ్లిక్స్ ప్రత్యేకమైన ఎంపికను అందిస్తుంది. లయన్స్ గేట్ ప్లే యాప్ లో హాలీవుడ్ కంటెంట్ లభిస్తుంది.