జనసేన పార్టీ నేత, తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మికి ఉపశమనం దక్కింది. కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మికి బెయిల్ మంజూరు అయింది. కిరణ్ రాయల్ నుంచి ప్రాణహాని ఉందని లక్ష్మి ఫిర్యాదు చేయగానే, ఇన్నాళ్లూ మౌనంగా ఉండి ఇప్పుడు తెరపైకి చెక్ బౌన్స్ కేసు వచ్చింది. ఈ కేసులో ఆమె అరెస్ట్ అయ్యారు. పాత చెక్ బౌన్స్ కేసులో లక్ష్మిని అరెస్ట్ చేసిన జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత ఆమెకు బెయిల్ మంజూరు అయ్యింది.