డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో స్టార్ హీరోయిన్ సమంత ప్రేమలో ఉందని, త్వరలో రెండో పెళ్లి చేసుకునే అవకాశముందని కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. ఇటీవల పికిల్ బాల్ టోర్నమెంట్ సందర్భంగా రాజ్ చేతిని పట్టుకొని కనిపించింది సమంత. దీంతో వీరి ప్రేమ వార్తలకు బలం చేకూరింది. ఇక ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా సమంత చేసిన ఒక పోస్ట్.. నిజంగానే ఏదో ఉందని హింట్ ఇచ్చేలా ఉంది. (Samantha Ruth Prabhu)
వాలెంటైన్స్ డే సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ లో “Just a TEASE. Or maybe more.” అంటూ కొన్ని ఫొటోలను పంచుకుంది సమంత. వాటిలో మూడు ఫొటోలు ప్రేమ, పార్టనర్ గురించి హింట్ ఇస్తున్నట్టుగా ఉన్నాయి. ఒక పిక్ లో “ఆల్ ది లిటిల్ థింగ్స్” అంటూ కొన్ని పాయింట్స్ ని షేర్ చేసింది. మరో పిక్ లో పార్టనర్ కి చీర్స్ కొడుతున్నట్టుగా ఉంది. ఇంకో పిక్ లో ఒక క్లాత్ మీద లవ్ సింబల్ స్ట్రిచ్ చేసి ఉంది. మొత్తానికి సమంత తాజా పోస్ట్ ని చూస్తే.. ప్రేమ, పెళ్లి వార్తలు నిజమే అనే అభిప్రాయం కలుగుతోంది.