ఊహించిందే జరుగుతోంది! దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మహీంద్రా అండ్​ మహీంద్రా నుంచి వస్తున్న రెండు కొత్త ఎలక్ట్రిక్​ కార్లకు భారతీయుల నుంచి సూపర్​ రెస్పాన్స్​ లభిస్తోంది. వాలెంటైన్స్​ డే నేపథ్యంలో మహీంద్రా బీఈ6, మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఈల బుకింగ్స్​ని సంస్థ ప్రారంభించగా.. ఈ రెండింటికీ మొదటి రోజే 30,179 బుకింగ్స్​ దక్కాయి. ఫలితంగా ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీల బుకింగ్​ వాల్యూ రూ. 8,472 కోట్ల (ఎక్స్​షోరూం ధర)కు చేరింది. ఈ 30,179 బుకింగ్స్​లో 44శాతం మంది బీఈ 6ని ఎంచుకోగా, మిగిలిన 56శాతం మంది ఎక్స్​ఈవీ 9ఈని బుక్​ చేసుకున్నారు. అంతేకాదు, మొత్తం మీద 79శాతం బుకింగ్స్​ టాప్​ ఎండ్​ వేరియంట్స్​కే వెళ్లడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here