స్లాప్ డే ను ఎలా జరుపుకోవాలి?

ఇలా చెంప దెబ్బ కొట్టడం అంటే మోసం చేసిన వారిని తమ మాజీ ప్రియుల దగ్గరకు వెళ్లి నిజంగానే చెప్ప దెబ్బ కొట్టడం మాత్రమే కాదు. ఇలా చేయడం అందరికీ వీలు కాదు. నేరుగా చెంప మీద కొట్టడం కాదు. వారి విషయంలో మీకున్న ప్రేమ, కోపం, ద్వేషం వంటి భావాలపై చెంప పెట్టు వేయడం. ప్రాణంగా ప్రేమించిన మనల్ని, ఊహించని రీతిలో మోసం చేసినప్పుడు వారిని మనసారా తిట్టాలని, పగ తీరేంత వరకూ కొట్టాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. కానీ, అలా చేయడం అందరికీ వీలు కాదు. సరైనది కూడా కాదు. అలాంటి లవ్ ఫెయిల్యూర్స్ తమ మససులోని భావాలను తుడిచివేయడం, కొత్తగా తమతో తాము తిరిగి ప్రేమలో పడటం కోసమే స్లాప్ డే జరుపుకుంటారు. అదేదో సినిమాలో చెప్పినట్లు, మనల్ని కాదనుకున్న వాళ్లకు మనం విధించే శిక్ష ఎలా ఉండాలంటే, వాళ్లు అనుకున్న దాని కన్నా బెటర్ గా బతికి చూపించడమే మీలో ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ ఉంటే ఈ విషయం మర్చిపోకండి. స్లాప్ డేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here