విశాఖపట్నంలో మరోసారి ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది.జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేసిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్రమైన కొట్లాట జరిగింది. దీంతో ర్యాగింగ్ పంచాయితీ పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది.విశాఖలోని దువ్వాడలో ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన చోటు చేసుకుంది. ర్యాగింగ్‌లో భాగంగా సీనయర్లు, జూనియర్లు తన్నుకున్నారు. ఈ క్రమంలో పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. పలువురు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ విషయమై బీఎన్‌ఎస్ 324 సెక్షన్ కింద కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.