పుష్ప 2 చిత్రాన్ని గ్రాండ్ స్కేల్‍లో యాక్షన్ మూవీగా సుకుమార్ తెరకెక్కించారు. ఫస్ట్ పార్ట్ తర్వాత అంచనాలు అత్యంత భారీగా ఉండగా వాటిని అందుకున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటనలో విశ్వరూపాన్ని చూపారు. ప్రశంసలు దక్కించుకున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటించారు. ఫాహద్ ఫాజిల్ నెగెటివ్ రోల్ పోషించారు. జగపతి బాబు, రావు రమేశ్, సునీల్, జగదీశ్, అనసూయ, అజయ్, తారక్ పొన్నప్ప కీరోల్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. సామ్ సీఎస్.. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍లో ఎక్కువ శాతం ఇచ్చారు.