కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishab Shetty)ప్రస్తుతం ‘కాంతర’ కి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న’కాంతర చాప్టర్ 1 ‘తో పాటు ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్'(the pride of bharat chhatrapati shivaji maharaj)అనే సినిమా కూడా చేస్తున్న విషయం తెలిసిందే.మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘సఫెద్’ మూవీ ఫేమ్ ‘సందీప్ సింగ్'(sandeep sing)దర్శకత్వం వహిస్తున్నాడు.ఈయన గతంలో ఎన్నో హిట్ సినిమాకి నిర్మాతగాను వ్యవహరించాడు.
రీసెంట్ గా సందీప్ సింగ్ ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి మహారాజ్’ కి వర్క్ చేస్తున్న టీంని ప్రకటించాడు.అనంతరం ఆయన మాట్లాడుతు ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ,మ్యూజిక్ ఇలా అన్ని విభాగాల్లో అత్యంత ప్రతిభావంతులు వర్క్ చేస్తున్నారు.ఇది కేవలం సినిమా కాదు.అసమానతలకి వ్యతిరేకంగా పోరాడి మొగలు సామ్రాజ్యాన్ని సవాలు చేసిన ఒక యోధుడి కథ. ఫస్ట్ లుక్ పోస్టర్ ని మే లో జరగనున్న ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో విడుదల చేయనున్నట్టు కూడా చెప్పుకొచ్చాడు.
2027 జనవరి 21 న ప్రేక్షకుల ముందుకు రానున్న ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్’ హిందీ తో పాటు తెలుగు, తమిళ ,మలయాళ,కన్నడ, మరాఠీ,బెంగాలి భాషల్లో ఒకే సారి విడుదల కానుంది. రచనా బాధ్యతలని సిద్దార్ధ్,గరిమా ద్వయం నిర్వహిస్తుండగా,ప్రీతమ్ సంగీతాన్ని, రవి వర్మన్ ఫొటోగ్రఫీ ని అందిస్తున్నారు.ఇక ప్రస్తుతం థియేటర్స్ లో శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘చావా’ సందడి చేస్తున్న విషయం తెలిసిందే.