“అనుభవజ్ఞులైన సిబ్బందిని పరీక్షల నిర్వహణకు వినియోగించుకోవాలి. ప్రతి పరీక్షా కేంద్రం సీసీటీవీ పర్యవేక్షణలో ఉండాలి. పరీక్షా సిబ్బంది వివరాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా కచ్చితమైన పరిశీలన జరపాలి. ప్రశ్నాపత్రాల భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది వివరాలను పూర్తిగా పరిశీలించాలి. ఏర్పాట్ల పర్యవేక్షణకు త్వరలోనే జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు” అని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య చెప్పారు.