‘లవ్ టుడే'(Love Tude)మూవీతో తెలుగు ప్రేక్షకుల మనస్సులో స్థానాన్ని సంపాదించిన తమిళ హీరో ప్రదీప్ రంగ నాథన్(Pradeep ranganathan)ఈ నెల 21 న ‘రిటర్న్ ఆఫ్ డ్రాగన్'(Return Of Dragon)అనే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో థియేటర్స్ లో సందడి చేయనున్నాడు.’అనుపమ పరమేశ్వరన్'(Anupuma Parameswaran)కయదు లోహర్(Kayadu LOhar)హీరోయిన్లు కాగా,ప్రచార చిత్రాలు సినిమాపై క్యూరియాసిటీని కలిగించేలా ఉన్నాయి.అస్వత్ మారిముత్తు(Ashwath Marimuthu)దర్శకత్వం వహించాడు.
రీసెంట్ గా ప్రదీప్ రంగ నాథన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు బీటెక్ చదివే రోజుల్లో కెమిస్ట్రీ ప్రశ్నలకి ఆన్సర్స్ గా సినిమా కథలు రాసాను.ఆ తర్వాత లెక్చరర్ నాతో బాగా ట్రై చేసావు గాని ఇంకెపుడు పరీక్షల్లో ఇలాంటి కథలు రాయద్దు అని చెప్పాడు.అందుకనే కథలు రాసే రంగాన్నే వృత్తిగా ఎంచుకున్నాను.ఫైనల్ పరీక్షల్లో మాత్రం బాగా చదివి పాసయ్యానని చెప్పుకొచ్చాడు.అప్పటి పరీక్ష పేపర్ ని సోషల్ మీడియాలో కూడా షేర్ చెయ్యగా అందులో 50 కి పదకొండు మార్కులు వచ్చినట్టుగా ఉంది.