ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో అందరికీ చేరిపోయే పరిస్థితిలో మనం ఉన్నాం. సినీ, రాజకీయ రంగాల్లోని ప్రముఖుల వృత్తిపరమైన విషయాలు, వ్యక్తిగత విషయాలు కూడా అందరికీ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ప్రముఖులు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా సినిమా ప్రపంచంలో ఏ చిన్న విషయమైనా సోషల్‌ మీడియాలోకి వచ్చేసి హల్‌చల్‌ చేస్తోంది. కొన్ని సందర్భాల్లో ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను కూడా ఏదో ఒక వేదికపై కొత్తగా పోస్ట్‌ చేసి వైరల్‌ చేసేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రస్తుతం ఏ రేంజ్‌లో ఉన్నాడో, ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నాడో అందరికీ తెలిసిందే. అలాగే బుల్లితెరపై జబర్దస్త్‌ షో ద్వారా రష్మీ గౌతమ్‌ కూడా పాపులర్‌ అయిపోయింది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో వీరిద్దరి ప్రేమాయణానికి సంబంధించిన వీడియోనే. ఆ వీడియోలో వీరిద్దరి మధ్య జరిగే సంభాషణ సరదాగా ఉండడమే కాకుండా నెటిజన్లకు కొత్త అనుభూతిని కలిగిస్తోంది. రష్మీ ప్రధాన పాత్రలో నటించిన ‘యువ’ సీరియల్‌లోని ఓ సన్నివేశం అది. అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ.. కిరణ్‌ దర్శకత్వంలో రూపొందించిన ఈ సీరియల్‌లో రాజమౌళి కూడా కనిపిస్తాడు. రష్మీ కాంబినేషన్‌లో వచ్చే ఆ సీన్‌ వివరాల్లోకి వెళితే..

యూత్‌ని టార్గెట్‌ చేస్తూ కొత్త టాలెంట్‌ని ప్రమోట్‌ చేసేందుకు అన్నపూర్ణ స్టూడియోస్‌ ‘యువ’ అనే సీరియల్‌ని ప్లాన్‌ చేసింది. మా టీవీలో ఈ సీరియల్‌ ప్రసారమయ్యేది. ఈ సీరియల్‌లో రాజమౌళి గెస్ట్‌గా కనిపిస్తారు. అది కూడా రష్మీ లవర్‌గా. డైరెక్టర్‌గా ఉన్న రాజమౌళి లవ్‌లో పడిపోయి రష్మీని ప్రేమించినట్టుగా క్రియేట్‌ చేసిన ఆ సీన్‌ ఎంతో సరదాగా అనిపిస్తుంది. అయితే ఈ వీడియో చూసిన వారు షాక్‌ అవుతున్నారు. ఎందుకంటే రాజమౌళి, రష్మీ ఇండస్ట్రీకి వచ్చిన ఇన్ని సంవత్సరాలవుతున్నా ఇప్పటి వరకు దీన్ని ఎవరూ హైలైట్‌ చెయ్యలేదు. సడన్‌గా ఈ వీడియో బయటికి రావడంతో క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల సరదా కామెంట్స్‌ పెడుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here