ఎందుకంటే కోపం అనేది అధిక రక్తపోటుకు, గుండె సమస్యలకు దారితీస్తుంది. నిత్యం కోపం, పగతో రగిలిపోవడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. ఇది మధుమేహం, ఆర్థరైటిస్ వంటి సమస్యలకు కారణం అవుతుంది. ఇక మానసిక సమస్యలు ఇంకా ఎక్కువైపోతాయి. నిరంతర కోపం, కక్ష, పగ వంటివి డిప్రెషన్ బారిన పడేలా చేస్తాయి. భావోద్వేగపరంగా అలసిపోయే అవకాశం ఉంటుంది.