ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా తన ప్రసిద్ధ స్ట్రీట్ నేకెడ్ బైక్ హార్నెట్ 2.0ను నవీకరించి విడుదల చేసింది. ఇప్పుడు కొత్త 2025 హోండా హార్నెట్ 2.0 అప్డేట్లో భాగంగా కొత్త ఫీచర్లతో పాటు కొత్త కలర్ ఆప్షన్‌ను పొందింది. ప్రస్తుత ధర భారతదేశంలో ఎక్స్-షోరూమ్ రూ.1,56,953గా ఉంది. ఇది రెడ్ వింగ్, బిగ్ వింగ్ డీలర్‌షిప్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.