నథింగ్ ఫోన్ 3ఏ సిరీస్: ధర (లీక్)
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో లభించే బేస్ మోడల్ అయిన నథింగ్ ఫోన్ 3ఏ ధర వరుసగా 349 యూరోలు (సుమారు రూ. 32,000), 399 యూరోలు (సుమారు రూ. 32,000). ఈ ధరలు మునుపటి తరం మోడల్ కంటే సుమారు 20 యూరోలు (సుమారు రూ. 1,800) ఎక్కువగా ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. దీనికి విరుద్ధంగా, నథింగ్ ఫోన్ 3ఏ ప్రో ఒకే కాన్ఫిగరేషన్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అది 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్. ఈ వేరియంట్ ధరను 479 యూరోలుగా (సుమారు రూ.43,000)గా నిర్ణయించారు. బ్లాక్, గ్రే రంగుల్లో నథింగ్ ఫోన్ 3ఏ ప్రో అందుబాటులో ఉండనుంది. మార్చి 11న నథింగ్ ఫోన్ 3ఏ సేల్ ప్రారంభం కానుండగా, మార్చి 25న ప్రో మోడల్ అందుబాటులోకి రానుంది.