ఈ ఘటనపై చైర్మన్ మాట్లాడుతూ కాలేజీ ప్రిన్సిపల్‌పై తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని, వారి ఫిర్యాదు మేరకు కాలేజీలో విచారణ జరిపామని తెలిపారు. విద్యార్థినితో ఫోన్లో ప్రిన్సిపల్ రాజశేఖర రెడ్డి చాటింగ్ చేయడం నిజమేనని తెలిసిందని, దీంతో ఆయనను విధుల నుంచి తొలగించామని పేర్కొన్నారు. కాలేజీలో చదువు తప్ప, ఇలాంటి చర్యలను తాము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని అన్నారు. అలాగే దీనిపై పూర్తి విచారణ చేయాలని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. ప్రస్తుతం ఈ కేసు పోలీసుల పరిధిలో ఉంది.
Home Andhra Pradesh కృష్ణా జిల్లాలో ఘోరం…డిగ్రీ విద్యార్థినితో కాలేజీ ప్రిన్సిపల్ ఫోన్ చాటింగ్…-shocking incident in krishna district...