ఈవో తనను ఖాతరు చేయడం లేదని, తన నిర్ణయాలను అమలు చేయడం లేదని, తాను చేసిన ప్రకటనల్ని అమలు చేసే విషయంలో అడ్డు పడుతున్నారని టీటీడీ ఛైర్మన్ ఇప్పటికే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. సిబ్బందికి నేమ్ బ్యాడ్జిలు పెట్టడం, శ్రీ వాణి ట్రస్టు వ్యవహారం, తిరుమలలో అన్యమతస్తుల్ని తొలగించడం సహా పలు కీలక నిర్ణయాలను అధికారులతో చర్చించకుండా ఛైర్మన్ నేరుగా ప్రకటించడంపై అధికారులు అసహనంతో ఉన్నారు. ఇది కాస్త తొక్కిసలాట ఘటనతో బయటపడింది. చివరకు ముఖ్యమంత్రి ఇద్దరిని సముదాయించి సర్దుకుపోవాలని సర్ది చెప్పాల్సి వచ్చింది.
Home Andhra Pradesh సర్దుకుపోదాం రండి..ఏపీలో ఐఏఎస్ వర్సెస్ అధికార పార్టీ నేతలు-ruling party leaders must come to...