Flying car: సైన్స్ ఫిక్షన్ నవలల్లో, సినిమాల్లో మాత్రమే కనిపించే ఒక దృశ్యాన్ని కాలిఫోర్నియాకు చెందిన ఒక ఆటోమొబైల్ కంపెనీ నిజం చేసింది. తమ ఎలక్ట్రిక్ కారు రోడ్డుపై మరో కారుపై నుంచి నిట్టనిలువగా ఎగిరి, గాలిలోనే కొంచెం ముందుకు ప్రయాణించి క్షేమంగా ల్యాండ్ కావడానికి సంబంధించిన ఒక వీడియోను ఆ కంపెనీ షేర్ చేసింది. “ఒక నగరంలో ఒక కారు వర్టికల్ టేకాఫ్ కు సంబంధించి ఇది చారిత్రాత్మకం” అని పేర్కొంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ అలెఫ్ మోడల్ జీరో టెస్ట్ వెర్షన్ ఎలక్ట్రిక్ వాహనం ఎగురుతూ, నెమ్మదిగా గాలిలో తేలియాడుతూ, తమ ముందున్న కార్లపై నుంచి ఎగురుతూ, కొంచెం ముందుకు వెళ్లి ల్యాండ్ కావడం ఈ వీడియోలో కనిపిస్తుంది.