అనారోగ్యమే కారణమా
మృతురాలు లక్ష్మీ భర్త కొద్ది సంవత్సరాల క్రితం మరణించగా, తన అక్క కొడుకైన శ్రీధర్ తో పాటు సిద్దిపేటలోని సాయి నగర్ లో కొంతకాలం ఓ ఇంటిలో కిరాయికి ఉన్నారు. కొన్ని నెలల క్రితం చేర్యాలకు వెళ్లారు. అయితే శ్రీధర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని, తాను పలు దవాఖానాల్లో వైద్యం తీసుకుంటున్న మెడికల్ రిపోర్టులు సంఘటన స్థలంలో లభ్యమయాయని పోలీసులు తెలిపారు. అయితే ఎన్ని ఆస్పత్రిలో వైద్యం తీసుకున్న, తనం నయం కాలేదని. అందువలనే, వారిద్దరూ తీవ్ర నిరాశలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారని ప్రాథమిక విచారణలో తేలింది.