శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్-SLBC టన్నెల్–1లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను తీసుకురావడం కష్టతరంగా మారింది. మోకాళ్ల లోతులో మట్టి, బురద కూరుకుపోయింది. టన్నెల్ లోపలకి వెళ్లే పరిస్థితే లేదని SDRF టీం ఆదివారం ఉదయం తేల్చి చెప్పింది. లోపల చిక్కుకున్న వారిని కాపాడుకునేందుకు మరో ప్రత్యామ్నయం ఆలోచించాలని SDRF బృందం తెలిపింది. అయితే లోపలకి పోయినప్పుడు తీసిన దృశ్యాలు భయానక వాతావరణం ఉన్నట్లు తెలుపుతున్నాయి.