‘నాచురల్ స్టార్ నాని’ (Nani)గత ఏడాది ‘సరిపోదా శనివారం'(saripoda Sanivaram)అనే మూవీతో అభిమానులని,ప్రేక్షకులని ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే.పైగా ఆ మూవీ ద్వారా తన కెరీరి లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ ని రాబట్టి సరికొత్త రికార్డుని కూడా సృష్టించాడు.ఈ క్రమంలోనే ఆయన అప్ కమింగ్ మూవీ ‘హిట్ ది థర్డ్ కేస్'(Hit the third case)పై అందరిలో అంచనాలు రెట్టింపు అయ్యాయి.
రీసెంట్ గా ‘హిట్ ది థర్డ్ కేస్’ టీజర్ రిలీజ్ అయ్యింది.టీజర్ రిలీజ్ అయ్యిందనే కంటే ‘మండే అగ్నిపర్వతం తన ‘లావా’ని విరజిమ్మటం రియల్ గా చూసినట్టు ఉందని చెప్పవచ్చు.నాని పెర్ఫార్మెన్స్ ఆ రేంజ్ లో ఉంది.దగ్గర దగ్గరగా ‘నిమిషం నలబై రెండు నిమిషాలు’ సాగిన టీజర్ లో ‘అర్జున్ సర్కార్’ అనే పోలీస్ ఆఫీసర్ గా నాని తన కెరీరి లో మరో పవర్ ఫుల్ ఫుల్ రోల్ లో ప్రేక్షకులని మెస్మరైజ్ చేయనున్నట్టుగా తెలుస్తుంది.వర్సటైల్ యాక్టర్ రావు రమేష్(Rao Ramesh)చేత అర్జున్ సర్కార్క్ క్యారక్టర్ ని పరిచయం చేస్తు చెప్పిన డైలాగ్స్ తోనే,మూవీ ఎలా ఉండబోతుందో,నాని పెర్ ఫార్మెన్సు ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్ధమైపోతుంది.యాక్షన్ సీక్వెన్స్ కూడా ఒక రేంజ్ లో ఉండబోతున్నాయని,రేపు థియేటర్స్ లో సరికొత్త నాని ని చూడబోతున్నామని కూడా తెలుస్తుంది.
హిట్ సిరీస్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న హిట్ 3 ని వాల్ పోస్టర్ సినిమా,యూనానిమస్,సంయుక్తంగా నిర్మిస్తుండగా హిట్ 1 , హిట్ 2 లని తెరకెక్కించిన’శైలేష్ కొలను'(Sailesh KOlanu) దర్శకత్వం వహిస్తుండగా,కెజీఎఫ్(Kgf)సిరీస్ తో పాన్ ఇండియా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్న కన్నడ భామ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty)హీరోయిన్ గా చేస్తుంది.మిక్కీ జె మేయర్ మ్యూజిక్ ని అందిస్తున్న ‘హిట్ 3’ మే 1 వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.