పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ ‘హరిహర వీరమల్లు'(Hari Hara Veera Mallu)రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకి సంబంధించి మొదటి భాగం మార్చి 28 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.పవన్ ఫస్ట్ టైం చేస్తున్న చారిత్రాత్మక మూవీ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా వీరమల్లుపై భారీ అంచనాలు ఉన్నాయి.మూవీ నుంచి ఇప్పటికే మొదటి పాటగా ‘మాట వినాలి’ రిలీజైన విషయం తెలిసిందే.పవన్ నోటి వెంట నుంచి వచ్చిన ఈ సాంగ్ రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది.ఇప్పుడు ‘కొల్లగొట్టినాదిరో’ అనే రెండో సాంగ్ ని కూడా చిత్ర బృందం విడుదల చేసింది.
ఆస్కార్ విన్నర్ ‘చంద్ర బోస్'(Chandrabose)సాహిత్యంలో ఈ పాట రూపొందగా,’వీరమల్లు’ ఏ కాలంలో అయితే తెరకెక్కుతుందో,ఆ కాలంలోని పదాలనే ‘చంద్రబోస్’ చాలా చక్కగా అమర్చి పాటని సమకూర్చాడు.సంగీతాన్ని అందించిన మరో ఆస్కార్ విన్నర్ ‘కీరవాణి'(keeravani)కూడా అలనాటి సాంగ్స్ ని తలపించే రీతిలో,ప్రతి ఒక్కలు పాడుకునేలా క్యాచీ ట్యూన్ ని అందించాడు.ఎక్కువ భాగం పాత తరం వాయిద్యాలన్నీ కంపోజ్ కోసం ఉపయోగించినట్టుగా కూడా తెలుస్తుంది.మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని లు కలిసి ఈ సాంగ్ ని పాడటం జరిగింది.గంటలోనే రెండు లక్షలకి పైగా వ్యూస్ ని సంపాదించింది
మేకర్స్ విడుదల చేసిన సాంగ్ తాలూకు వీడియోని చూస్తే ‘పవన్ కళ్యాణ్’ స్క్రీన్ ప్రజెన్స్ సూపర్ గా ఉంది. పవన్ తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal)అనసూయ,పూజిత పొన్నాడ డాన్స్ చెయ్యడం చూస్తుంటే రేపు థియేటర్స్ లో ఈలలు, చప్పట్ల హోరు ఖాయమని అనిపిస్తుంది.ఈ ఒక్క సాంగ్ ద్వారానే నిర్మాణ విలువలు కూడా ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో కూడా చెప్పినట్టయ్యింది.టోటల్ గా ఈ సాంగ్ తాలూకు వీడియో ‘వీరమల్లు’ పై అంచనాలని మరోస్థాయికి తీసుకెళ్ళిందని కూడా చెప్పవచ్చు.17వ శతాబ్దానికి చెందిన మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కుతున్న’వీరమల్లు’ని మెగా సూర్య మూవీస్ పతాకంపై ఏఎంరత్నం(A.M Rathnam)దయాకర్ రావు లు నిర్మిస్తున్నారు.క్రిష్(Krish)జ్యోతి కృష్ణ(Jyothi Krishna)సంయుక్తంగా దర్శకత్వం వహించగా,బాబీడియోల్,నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి ముఖ్య పాత్రల్లో కనిపించారు.