Katrina Kaif Maha Kumbhmela: సోమవారం మహాకుంభ్ కి వెళ్లిన కత్రినా.. అక్కడ పరమార్థ నికేతన్ ఆశ్రమానికి వెళ్లింది. కత్రినాతోపాటు ఆమె అత్తగారు బీనా కౌశల్ కూడా ఉన్నారు. అక్కడ ఆమె ఆశ్రమ మహారాజ్ స్వామి చిదానంద సరస్వతిని కలిసింది. పరమార్థ నికేతన్ ఆశ్రమంలోని సాధువులతో మాట్లాడి, అఖాడాలో నేలమీద కూర్చుని ఆధ్యాత్మిక చర్చల్లో మునిగిపోయింది.
(ANI)