వారు భుజించిన తదుపరి మళ్ళీ వారిని మంత్ర జలములతో శిశువులగా మార్చి, తన వద్ద ఉంచుకుంది. పార్వతీ, లక్ష్మీ, సరస్వతీ వారిని వెతుక్కుంటూ వారికి వారి భర్తలని అప్పగించెను. అప్పుడు త్రిమూర్తులు ఆమెకు వరము ప్రసాదించారు. ఆమె వారిని తమ బిడ్డలుగా జన్మించమని కోరింది. త్రిమూర్తులు చంద్రుడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడుగా ఆమె గర్భమున జన్మించారు.