సూపరిపాలన అంటే అన్ని వర్గాలకు మోసం చేయడమా అని కూటమి సర్కార్ ని వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి ప్రశ్నించారు. తొమ్మిది నెలలో లక్ష కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవ్వాల్సిన బకాయిలు పెండింగ్ పెట్టారని అన్నారు. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం చెలరేగింది.