పాన్ ఇండియా స్టార్ ‘ప్రభాస్'(Prabhas)ప్రస్తుతం’ది రాజాసాబ్'(The Raja saab)హను రాఘవపూడి(Hanu Raghavapudi)సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ఈ రెండు చిత్రాల్లో ‘రాజాసాబ్’ ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.చిత్ర బృందం  ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రభాస్ లుక్స్, టీజర్ ఒక లెవల్లో ఉండటంతో, అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ‘రాజాసాబ్’ పై భారీ అంచనాలు ఉన్నాయి.పైగా వింటేజ్ ప్రభాస్  కనిపించబోతుండటంతో,ఎప్పుడెప్పుడు ‘రాజాసాబ్’ థియేటర్స్ లోకి వస్తాడా అని ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ మూవీ ఏప్రిల్ 10 న రిలీజ్ అవుతుందని తొలుత మేకర్స్ అధికార ప్రకటన చేసారు.కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్ వాయిదా పాడింది.దీంతో కొత్త రిలీజ్ డేట్ కోసం అభిమానులు,ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉన్నారు.కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఉగాది కానుకగా కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారనే ప్రచారం సినీ సర్కిల్స్ లో జరుగుతుంది.

‘రాజాసాబ్’ కి మారుతి(Maruthi)దర్శకతం వహిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్(Viswaprasad)అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు.ప్రభాస్ సరసన నిధి అగర్వాల్(Nidhhi Agerwal)మాళవిక మోహన్(Malavika Mohanan)హీరోయిన్లుగా చేస్తుండగా థమన్(Thaman)సంగీతాన్ని అందిస్తున్నాడు.ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నాడనే టాక్ అయితే ఉంది.

 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here