తూర్పుగోదావరి జిల్లాలోని తాడిపూడిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శివరాత్రి సందర్భంగా.. గోదావరిలో దిగిన ఐదుగురు యువకులు గల్లంతు కాగా.. ప్రాణాలు కోల్పోయారు. తిరుమల శెట్టి పవన్(17), పడాల సాయి కృష్ణ(19), పి. దుర్గాప్రసాద్ (19), జి.ఆకాశ్ (19), అనిశెట్టి పవన్(19) ను మృతులుగా గుర్తించారు.