PURE EV Cashback Offers: భారతదేశపు ఎలక్ట్రిక ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజాల్లో ఒకటైన ప్యూర్ ఈవీ, తమ కస్టమర్ల కోసం అసాధారణమైన క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను అందించే ‘ప్యూర్ పర్ఫెక్ట్ 10’ రిఫరల్ ప్రోగ్రాంను ప్రారంభించింది. శివరాత్రి, హోళీ, ఉగాది, రంజాన్ సహా పండుగల సీజన్ నేపథ్యంలో కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు, దేశవ్యాప్తంగా ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఈ విశిష్టమైన ఆఫర్ దోహదపడనుంది.