- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధింత విభాగంలో పీజీ డిగ్రీ ఉండాలి.
- ఎంసీఐ లేదా ఎన్ఎంసీ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవటంతో పాటు పని చేసిన అనుభవం కూడా ఉండాలి.
- వయసు 45 ఏళ్లు మించకూడదు. కొన్ని వర్గాల అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు చూడొచ్చు
- ఈ పోస్టులను తాత్కాలిక పద్ధతిలో ఏడాది కాలానికి రిక్రూట్ చేస్తున్నారు. పని తీరు ఆధారంగా మూడేళ్ల వరకు పొడిగించవచ్చు.
- అర్హత కలిగిన అభ్యర్థులు ఎయిమ్స్ బీబీ నగర్ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాలి.
- జనరల్ అభ్యర్థులు రూ. 1770, ఈడబ్యూఎస్ అభ్యర్థులు రూ. 1416 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఎలాంటి ఫీజు లేదు.
- అభ్యర్థుల ధ్రువపత్రాలు, అర్హతలను పరిశీలించిన తర్వాత… షార్ట్ లిస్ట్ చేస్తారు. వారిని మాత్రమే ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
- మార్చి 5వ తేదీ నుంచి ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఆడిటోరియంలో ఉదయం 09. 30 గంటలకు వీటిని నిర్వహిస్తారు. మార్చి 7వ తేదీలోపు అన్ని విభాగాల ఇంటర్వ్యూలు పూర్తవుతాయి.
- ఏమైనా సందేహాలు ఉంటే sr.aiimsbibinagar@gmail.com మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ఆన్ లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫిటెట్, విద్యా అర్హత ధ్రువపత్రాలు, ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన పత్రాలు. యూజీ, పీజీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్, పని చేసిన అనుభవం ఉంటే సంబంధిత పత్రాలు తీసుకెళ్లాల్సి ఉంటుంది.