ఆల్కహాల్ వద్దు..
వడదెబ్బ లక్షణాలు (తల తిరగడం, వాంతులు, అధిక జ్వరం) కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా నీళ్ల బాటిల్ తీసుకెళ్లాలి. ఆల్కహాల్, కెఫిన్ అధికంగా ఉండే పానీయాలకు దూరంగా ఉండాలి. ఎక్కువ శ్రమతో కూడిన పనులు చేయకూడదు. చల్లని ప్రదేశాలలో ఉండటానికి ప్రయత్నించాలి. అలసటగా అనిపిస్తే వెంటనే విశ్రాంతి తీసుకోవాలి.