ఆందోళన, డిప్రెషన్ వేరు వేరు అని చెప్పే 3 లక్షణాలు..

మొదటి తేడా

  • ఆందోళన ఉన్నవారు అధికంగా ఆలోచిస్తూ ఉంటారు. చిన్న విషయం, పెద్ద విషయం అనే తేడా లేకుండా, ఆలోచించాల్సిన అవసరం లేకుండా నిరంతం ఆలోచిస్తూనే ఉంటారు. వారి మనసులో ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన మెదులుతూనే ఉంటుంది.
  • డిప్రెషన్ ఉన్నవారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండవు. వారి మనసు ఎప్పుడూ పూర్తిగా ఖాళీగా ఉంటుంది. వారు దేని గురించీ ఆలోచించరు.

రెండవ తేడా

  • ఆందోళన ఉన్నవారు సాధారణంగా అంటే చూడటానికి బాగానే ఉన్నట్లు కనిపిస్తారు. కానీ ఏదైనా ఊహించని విషయం జరిగితే లేదా ఏదైనా అనుకోని సంఘటన జరిగితే చాలా భయపడిపోతుంటారు, పానిక్ అయిపోతారు.
  • డిప్రెషన్ ఉన్నవారికి బయటి ప్రపంచంలో జరిగే మంచి చెడు సంఘటనలతో ఎలాంటి సంబంధమే ఉండదు. వారు ఎల్లప్పుడూ విచారంగా, బాధగా ఉంటారు. సంతోషకరమైన పరిస్థితుల్లో కూడా దీన్నే మెయింటేన్ చేస్తారు.

మూడవ తేడా

  • ఆందోళన ఉన్నవారు తమను తాము చాలా ముఖ్యమైనవారుగా భావిస్తారు. వారు తామే ప్రతి ఒక్కరికీ కేంద్రంగా ఉంటారని భావిస్తారు. వారు లేకుండా ఇంట్లో, కుటుంబంలో, ఆఫీసులో ఏ పని జరగదని ఫీలవుతారు. వారి కుటుంబం గురించి వారికి ఎల్లప్పుడూ ఆందోళన ఉంటుంది. వారు లేకుంటే వారి కుటుంబానికి ఏమి జరుగుతుందో అని అనవరమైన ఆలోచనలతో ఆందోళనగా జీవిస్తారు. అలాంటి వారు ఎల్లప్పుడూ తమను, తమ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని కోరుకుంటారు.
  • ఇక డిప్రెషన్ తో బాధపడుతున్న వారు వారు తమను తాము నిరుపయోగంగా భావిస్తారు. వారు ఏ పని చేయలేరనీ, ఎవరికీ పనికి రాని వారని, వారు బాగుండకూడదని భావిస్తారు. డిప్రెషన్ ఉన్నవారికి ప్రోత్సాహం ఇవ్వడం చాలా ముఖ్యం.

మీరు గానీ మీ చుట్టు పక్కల వారు గానీ ఈసమస్యలతో బాధపడుతున్నట్లయితే తేడాలను గమనించి ఆందోళన, డిప్రెషన్‌లకు తగిన చికిత్స లేదా కౌన్సిలింగ్ వంటివి తీసుకోవాలని సైకాలజిస్ట్ డాక్టర్ కన్నయ వివరించారు. వీటి నుంచి బయటపడటం కోసం వ్యాయామాలు, యోగా, ఆహార నియమాల్లో కొన్ని మార్పులు తప్పనిసరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here