ఉపవాస నియమాలు

  • ఉపవాస దీక్షను యుక్త వయస్సుకు వచ్చిన ప్రతి ముస్లిం వ్యక్తి పాటించాలి. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరికీ తప్పనిసరి. ఒకవేళ ఏదైనా తాత్కాలిక అనారోగ్య సమస్య ఎదురైతే అది పూర్తయిన తర్వాత మళ్లీ ఉపవాసం పాటించాలి. (జ్వరం లాంటిది ఏదైనా కలిగితే తగ్గిన తర్వాత దీక్ష కొనసాగించాలి)
  • ఉపవాసానికి నియ్యత్ లేదా సరైన ఉద్దేశ్యం అవసరం. నియ్యత్ అంటే సంకల్పించుకోవడం. ఉపవాసం ఉండటానికి ముందు తెల్లవారు జామునే సహరీ (ఉదయం భోజనం) తినేస్తారు. ఆ తర్వాత నియ్యత్ (సంకల్పం) ద్వారా ఉపవాస దీక్షను ప్రారంభిస్తారు. ఇలా వ్యవహరించడంలో వారిలో నిజాయితీని పెంచడంతో పాటు సంకల్ప సిద్ధిని పెంచుతుంది.
  • తాత్కాలిక అనారోగ్యం (జ్వరం లాంటి సమస్య)తో బాధపడుతున్న వ్యక్తి కోలుకున్న తర్వాత దీక్షను కొనసాగించాలి. దాంతో పాటుగా ఎన్ని రోజులైతే ఉపవాసం ఉండకుండా వదిలేశాడో, ఆ రోజులను తర్వాత ఉపవాసం పాటించి భర్తీ చేయాలి.
  • దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న లేదా ఉపవాసం ఉండలేని వారు ఫిద్యహ్ చెల్లించాలి. అంటే, తాను ఉపవాసం ఉండలేకపోయిన ప్రతి ఉపవాస దినానికి పరిహారంగా పేదలకు ఆహారం దానం చేయడం.
  • వీలైనంత వరకూ, రమజాన్ నెలలో ప్రయాణం చేయకుండా ఉండాలి. అత్యవసరమైతే తప్ప, ప్రయాణం చేయకూడదు. కానీ ప్రయాణం తప్పనిసరి అయితే మాత్రం, ఉపవాసాన్ని వీలైనంత త్వరగా మరో రోజుకు వాయిదా వేయాలి.
  • సమయ వ్యవధిని కూడా అర్థం చేసుకోవాలి. ఉపవాస సమయం ఉదయం కంటే ముందు ప్రారంభమై సూర్యాస్తమయం తర్వాత ముగుస్తుంది. ఉపవాసం ప్రారంభించే ముందు సహరీ అనే ఉదయం భోజనం తీసుకుంటారు. అలాగే, ఉపవాసం ప్రారంభించే ముందు, నియ్యత్ కూడా అవసరం.
  • ఉపవాస సమయంలో, ఆహారం, నీరు, ధూమపానం, లైంగిక కార్యకలాపాలు పూర్తిగా నిషేధం.
  • అబద్ధం చెప్పడం, పోరాడటం, శపించడం, వాదించడం వంటి ఇతర ప్రతికూల ప్రవర్తనలను నివారించాలి.
  • ఉద్దేశపూర్వకంగా వాంతి చేసుకోవడం అంటే ఉపవాస నియమాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. ఆ ఉపవాసం చెల్లదట కూడా.

ఉపవాస ప్రాముఖ్యత

ఇస్లాంలోని నాల్గో స్తంభం ఉపవాసం. ముస్లింలు తప్పుకుండా పాటించాల్సిన ఆచారాల్లో ఒకటి. కాబట్టి, ఇది చాలా డీప్ ఫీలింగ్ తో కొనసాగుతుంది. భక్తి, ఆత్మపరిశోధన కాలంగా పనిచేస్తుంది. ముస్లిం విశ్వాసానికి ఆధారం అయిన ఉపవాస దీక్ష ప్రజలను అల్లాహ్‌కు దగ్గర చేస్తుంది. ఇది ముస్లింల అందరిలో ఆధ్యాత్మిక సంబంధాన్ని బలోపేతం చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here