ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న కార్మికులు బతికే అవకాశం లేదని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. రాజకీయ దురుద్దేశం తోనే SLBC పై హరీష్ రావు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. పది సంవత్సరాలు పాలించిన BRS ఎందుకు SLBC ని పెండింగ్ పెట్టారని ప్రశ్నించారు.