అందంగా కనిపించడం అంటే కేవలం ముఖం మాత్రమే కాదు కదా! చేతులు, కాళ్లు, మెడ భాగం కూడా శుభ్రంగా, మెరుస్తూ కనిపించాలి. కానీ కొంత మందికి మెడ భాగం మొత్తం పూర్తిగా నల్లగా మారిపోయి చూడటానికి చాలా చిరాకుగా కనిపిస్తుంది. దీని వల్ల వాళ్లు ఎక్కడికెళ్లినా ఇబ్బందిగా, అసౌకర్యంగా ఫీలవుతుంటారు. ఇలాంటి సమస్యే మీకు కూడా ఉంటే ఈ చిట్కాలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ సింపుల్ చిట్కాలతో మీ మెడను శుభ్రం చేసుకున్నారంటే మెడ నలుపంతా క్షణాల్లో తగ్గిపోతుంది. ఇందుకోసం మీకు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో మీ మెడను తెల్లగా, కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా మీ మెడ నలుపును మాయం చేసే ఆ చిట్కాలేంటో చూసేద్దాం రండి..