జిల్లా కలెక్టర్ చెప్పిన తాజా వివరాలివే:
ఎస్ ఎల్ బి సి టన్నెల్ కొనసాగుతున్న సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ………….. టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వైద్య సిబ్బంది ఆక్సిజన్ అందుబాటులో ఉంచారు. సహాయ చర్యలను మరింత వేగవంతం చేసేందుకుఎస్ ఎల్ బి సి టన్నెల్ ప్రమాదంలో 12 బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయన్నారు. వీటిలో ఆర్మీ, నే, ఎన్డీఆర్ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ, ఫైర్ సర్వీసెస్, నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హైడ్రా, సౌత్ సెంట్రల్ రైల్వే ప్లాస్మా కట్టర్స్, ర్యాట్ మైనర్స్, బృందాలు నిరంతరం సమన్వయంతో సహాయక చర్యలు వేగవంతం చేసినట్లు వివరించారు.