మహాశివరాత్రి జాతర ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడిన వినోద్ రెడ్డి…. మహాశివరాత్రి మూడు రోజులపాటు ప్రసాదాల అమ్మకం, ఆర్జిత సేవా టికెట్ల ద్వారా ఒక కోటి 30 లక్షల ఆదాయం వచ్చినట్లు వివరించారు. ప్రసాదాల అమ్మకం ద్వారా 57 లక్షల 12 వేలు, కోడెముక్కు ద్వారా 45 లక్షల 83 వేలు, కేశఖండనం ద్వారా ఆరు లక్షల 89 వేలు, 100 రూపాయల శీఘ్ర దర్శనం ద్వారా ఆరు లక్షల 97 వేలు, 300 రూపాయల అతి శీఘ్ర దర్శనం ద్వారా 13 లక్షల 04 వేల రూపాయల ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు.