5.సింహ లగ్నం లేదా సింహ రాశి
సింహ లగ్నం లేదా సింహ రాశిలో జన్మించిన వారు శని యంత్రాన్ని పూజించవచ్చు. కానీ వారి జన్మ కుండలిలో శని తుల, మకర లేదా కుంభ రాశులలో ఉండాలి. దీని వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనసులోని భావాలను వ్యక్తపరచడానికి అవకాశం ఉంటుంది. అందరితో ప్రేమ, విశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో ఆశించిన స్థానం లభిస్తుంది. పనులు నెమ్మదిగా సాగినప్పటికీ, వెనుకడుగు వేయకూడదు. కుటుంబంలో శాంతి, ప్రశాంతత ఉంటుంది.