శత్రు బాధలు, నరదిష్టి సమస్యల నుంచి బయట పడాలంటే ఎప్పుడు దిష్టి గుమ్మడికాయ కట్టాలి?

  1. బూడిద గుమ్మడికాయ శివ శక్తుల సంయుక్త స్వరూపం. బూడిద గుమ్మడికాయ సానుకూల శక్తిని, ప్రతికూల శక్తిని రెండిటిని కూడా తీసుకుంటుంది.
  2. బూడిద గుమ్మడికాయను ఇంటికి కట్టేటప్పుడు దానిని శుభ్రంగా కడగకూడదు. అలా కడిగినట్లయితే దానికి ఉన్న గుణాలు తొలగిపోతాయి. ఇంటికి బూడిద గుమ్మడికాయని కట్టే ముందు పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టాలి.
  3. బూడిద గుమ్మడికాయ కి తొడిమ ఉండాలి. తొడిమ లేని బూడిద గుమ్మడికాయని కడితే పనిచేయదు. దాని వలన ఎలాంటి రక్షణ కలగదు.

బూడిద గుమ్మడికాయని ఏ రోజుల్లో కడితే మంచి ఫలితం ఉంటుంది?

  1. అమావాస్య రోజు, అది కూడా సూర్యోదయానికి ముందు బూడిద గుమ్మడికాయను ఇంటికి కట్టడం వలన అద్భుతంగా పనిచేస్తుంది.
  2. బుధవారం, శనివారం రోజుల్లో కూడా సూర్యోదయానికి ముందు ఇంటికి బూడిద గుమ్మడికాయని కట్టుకోవచ్చు.
  3. సూర్యోదయానికి ముందు బూడిద గుమ్మడికాయని కడితే ఉత్తమ ఫలితాలని పొందవచ్చు. సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత బూడిద గుమ్మడికాయను ఇంటికి కట్టడం వలన ఎలాంటి లాభం ఉండదు.
  4. గుమ్మడికాయను ఇంటి ముందు కట్టడం వలన కాలభైరవుడు మన ఇంటికి రక్షణగా ఉంటాడని వాస్తు పండితులు చెప్తున్నారు.
  5. ఇంటికి వచ్చే చెడు శక్తులు, దోషాలు ఇవన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here